![]() |
![]() |
.webp)
స్టార్ మాలో గుప్పెడంత మనసు సీరియల్ అంటే చాలు కళ్లప్పగించుకుని మరీ చూస్తారు యూత్, వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మలు కూడా...యూత్ కేమో అలాంటి సర్ కావాలని, అమ్మలకేమో వాళ్ళ ఆడపిల్లలు ఇలాంటి అబ్బాయి ఐతే ఎంత బాగుండో అని కలలు కంటూ ఆ సీరియల్ చూస్తూ ఉంటారు. ఇక ఈ సీరియల్ మంచి పీక్స్ లో ఉండి మంచి రేటింగ్ రిషికి మంచి ఫాలోయింగ్ వస్తోంది అనగా దాన్ని చింపి చాట చేశారు. టైమింగ్స్ మార్చేశారు.
రిషిని తీసేసారు. ఇంకో హీరోని పెట్టారు. రిషిని సోషల్ మీడియాలో ఆ సీరియల్ టీమ్ వాళ్ళు నానా మాటలు అన్నారు. ఎట్టకేలకు ఫాన్స్ తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది అనడానికి సాక్ష్యంగా మళ్ళీ సీరియల్ లోకి రిషి ఎంట్రీ ఇచ్చాడు. టైమింగ్స్ కూడా పాత టైమింగ్స్ సెట్ చేసారు. అలాంటి రిషి ఇప్పుడు ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. టైగర్ స్మార్ట్ గా ఉంటె అది రిషిలా ఉంటుందా అనేంత అందంగా ఉన్నాడు. ఇంకేముంది అసలే అందగాడు ఇంకా ఈ లుక్ లో చూసినవాళ్లంతా ఫిదా ఐపోతున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ అని పొగిడేస్తున్నారు. సూపర్ కూల్ లుక్స్, స్టైలిష్ ఐకాన్ , సూపర్ అవుట్ ఫిట్, ఒక టైగర్ ఇంకో టైగర్ ని వేసుకుంది..లుకింగ్ లైక్ ఏ వావ్ అంటున్నారు. రిషి సర్ అంటే అట్లుంటది మరి.
![]() |
![]() |